Wednesday, May 8, 2024

KNR | కల్వల ప్రాజెక్టు పునఃనిర్మాస్తాం.. రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు నీటి కోతకు గురై భారీగా నీరు బయటికి వెళ్లడంతో త్వరలోనె ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి రిపేర్లు చేస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్  రెడ్డి అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) హుజురాబాద్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు అధిక నీటితో కోతకు గురయ్యింది. జిల్లా కలెక్టర్, సిపి, ఇతర అధికారులతో కలిసి కౌశిక్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టు దెబ్బతిందని, దీన్ని కాపాడే దిశగా ఇసుక బస్తాలను వేసినట్టు తెలిపారు.  ఈ ప్రాజేక్టు ద్వారా దాదాపు 2030 ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని అందుతుందన్నారు.

భారీ వర్షాలు కురవడం, సామర్థ్యానికి మించి ప్రాజెక్టులోకి నీరు చేరడంతో డ్యామెజ్ జరిగిందని, జరిగిన నష్టాన్ని గురించి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్​ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ కు తెలియజేయడం జరిగిందన్నారు.  స్పందించిన సీఎం నీటి ప్రవాహం తగ్గిన వెంటనే ప్రాజెక్టు రీడైజైన్ చేసి కొత్తప్రాజెక్టును నిర్మించనున్నట్టు తెలిపారన్నారు.  రైతులను ఆదుకునే దిశగా ఎంతఖర్చైన వెనకాడేది లేదని, అతిత్వరగా ప్రాజేక్టు పునఃనిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని కౌశిక్​రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. గోపి, సిపి సుబ్బారాయడు, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, హుజురాబాద్ ఆర్డిఓ హరిసింగ్, ఎసిపి జీవన్ రెడ్డి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement