Sunday, April 28, 2024

నేడు వరంగల్‌ లో జీ తెలుగు డాన్స్‌ ఇండియా డాన్స్‌ ఆడిషన్స్‌

జీ తెలుగు తమ వీక్షకులకు నాన్‌-స్టాప్‌ వినోదాన్ని పంచేందుకు గానూ, ప్రతిభను గుర్తించి, దాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన జీ నెట్ వర్క్‌ ప్రీమియం రియాలిటీ షో డాన్స్‌ ఇండియా డాన్స్‌ ఇప్పుడు తెలుగులో త్వరలో మీ ముందుకు రాబోతుంది. జీ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న అద్భుతమైన డాన్సర్స్‌ ని వెతికిపట్టుకునేందుకు ఆడిషన్స్‌ నిర్వహించబోతుంది.

ఇందులో భాగంగా జీ తెలుగు జూన్‌ 23న (నేడు) వరంగల్‌ లోని హన్మకొండలోని నక్కలగుట్టకి చెందిన హోటల్‌ సుప్రభలో ఆడిషన్స్‌ నిర్వహించనుంది. డాన్స్‌ మీద ఆసక్తివున్న 6 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వారెవరైనా ఈ ఆడిషన్స్‌ లో పాల్గొనవచ్చని తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు జూన్‌ 23న ఖమ్మంలో, జూన్‌ 24న కర్నూల్‌, విజయవాడలో, జూన్‌ 26న తిరుపతి, వైజాగ్‌లో జరిగే ఆడిషన్స్‌ లో కూడా పాల్గొనవచ్చని తెలిపింది. ఆదేవిధంగా ఆశావహులు డిజిటల్‌ ఆడిషన్స్‌ లో కూడా పాల్గొనవచ్చని, మీ డాన్స్‌ వీడియో షూట్‌ చేసి 9154984009 నెం.కి వాట్సాప్‌ చేయవచ్చని లేదా డీఐడీ.జీతెలుగు జీ మెయిల్‌ కు పంపవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement