Saturday, May 4, 2024

నాలుగు నెల‌లుగా సైఫ్ వేధింపులు – మ‌న‌స్థాపంతో ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

వ‌రంగ‌ల్ – కెఎంసి మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతిని సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులకు గురిచేశాడని , మ‌న‌స్థాపంతోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింద‌ని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ వెల్ల‌డించారు.. నిందితుడు సైఫ్ పై ర్యాగింగ్ కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు.. వ‌రంగ‌ల్ లో సిపి మీడియాతో మాట్లాడుతూ, కేసు వివ‌రాలు తెలిపారు.. ఇతర విద్యార్థులతో కలిసి ప్రీతిని వాట్సాప్ గ్రూపుల్లో సైఫ్‌ టార్గెట్ చేసినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో అవమానకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల విచారణపై ప్రభావం పడుతుందని అన్నారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభింయాని చెప్పారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు.


సిపి మాట్లాడుతూ, ‘నాలుగు నెలలుగా ప్రీతిని సైఫ్‌ వేధిస్తున్నాడు. కేస్‌ షీట్‌ విషయంలో ప్రీతిని అవమానించేలా మాట్లాడాడు. దీనిపై ఈ నెల 18న వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ప్రీతి సైఫ్‌ను పర్సనల్‌గా ప్రశ్నించింది. తనను ఉద్దేశించి వ్యక్తిగతంగా చాట్‌ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. అతడు తనను టార్గెట్‌ చేసి వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాటింగ్‌లో ప్రీతి పేర్కొంది. బ్రెయిన్‌ లేదంటూ సైఫ్‌ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన చెందింది. మొదట్నుంచీ సైఫ్‌ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది. గత ఏడాది డిసెంబర్‌ 6న రెండుమూడు సార్లు చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. సీనియర్లను జూనియర్లు సార్‌ అని పిలవాలనే కల్చర్‌ అక్కడుంది. ఈ నెల 20వ తేదీన వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి చెప్పింది. 21వ తేదీన కాలేజీ యాజమాన్యం ప్రీతి, సైఫ్‌ను పిలిచి విచారించింది. అయినా అతని తీరు మారలేదు. మంగళవారం తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది’ అని వివరించారు.

ఎసిపి ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే….

క‌ళాశాల‌లో సీనియ‌ర్ విద్యార్ధి సైఫ్ త‌న‌ను వేదిస్తున్నాడ‌ని రైల్వే ప్రొట‌క్ష‌న్ పోర్స్ లో ఎఎస్ ఐ గా ప‌నిచేస్తున్న తండ్రికి ఫిర్యాదు చేసింది ప్రీతి.. తండ్రి పోలీస్ ఉద్యోగి కావ‌డంతో త‌న‌కు త‌గిన ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని ఆశించింది.. ప్రీతి చెప్పిన విష‌యాల‌ను
వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ కు తండ్రి న‌రేంద‌ర్ వాట్స ప్ ద్వారా స‌మాచారం అందించాడు.. అయితే అటువైపు నుంచి ఎటువంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో ఆదే విష‌యాన్నికుమార్తె ప్రీతికి తెలిపాడు తండ్రి.. అంతే కాకుండా సైఫ్ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ మ‌ద్ద‌తు కూడా ఉండ‌వ‌చ్చంటూ తెలిపాడు.. దీంతో పోలీసుల నుంచి ఎటువంటి స‌హ‌కారం ల‌భించ‌ద‌ని భావించిన ప్రీతి మోతాదు మించిన క్లోరో ఫాం ను ఇంజ‌క్ష‌న్ ద్వారా ఎక్కించుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింద‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు.. ఫిర్యాదు చేసిన వెంట‌నే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘ‌ట‌న జ‌రిగేది కాద‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement