Thursday, May 2, 2024

నాటు నాటుకి డ్యాన్స్ ఇర‌గ‌దీసిన.. పాకిస్థాన్ న‌టి

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఇంకా ప్ర‌జ‌ల నోళ్ల‌ల్లో నానుతూనే ఉంది. దేశాలు దాటి ప్ర‌పంచ‌వ్యాప్తంగా కీర్తిని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. కాగా భార‌త్ కి దాయాది దేశమైన పాకిస్థాన్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ మానియా కొన‌సాగుతోంది. కాగా ప్రముఖ పాకిస్థానీ నటి హానియా ఆమిర్ సైతం నాటునాటు పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. ఓ వివాహ వేడుకలో భాగంగా కుర్రాడితో కలసి హానియా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ ను పాకిస్థాన్ కు చెందిన ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వివాహానికి అతిథిగా వచ్చిన హానియా తన డ్యాన్స్ తో అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో వివాహ వేదిక ఉత్సాహంగా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement