Sunday, May 5, 2024

నాని బ‌ర్త్ డే.. క్రేజీ పోస్ట్ పెట్టిన నేచుర‌ల్ స్టార్

నేడు నేచుర‌ల్ స్టార్ హీరో నాని పుట్టిన రోజు. కాగా సోషల్ మీడియాలో నానిని అభిమానించే వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో నాని అందరికీ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ పెట్టారు. దానికి తోడుగా అదిరిపోయే నోట్ కూడా రాసుకొచ్చారు. ప్రతి శుక్రవారం ‘సినిమాలు’ రిలీజ్ అవుతున్న తరుణంలో తానూ శుక్రవారమే రిలీజ్ అయ్యానంటూ ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేశారు. ఆ నోట్ లో.. నేనూ 1984, ఫిబ్రవరి 24న.. అది కూడా శుక్రవారమే రిలీజ్ అయ్యాను. గత 15 ఏండ్లుగా మళ్లీ మళ్లీ ఇలా శుక్రవారం రోజున పుడుతూనే ఉన్నారు. ఇక ఈ శుక్రవారం కూడా అందరీ ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే మరెన్నో వేడుకలు జరుపుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను.’ అంటూ ఆసక్తికరంగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం నాని నటించిన ‘దసరా’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement