Thursday, May 2, 2024

వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలి : విన‌య్ భాస్క‌ర్

క్రూ లింక్ తరలింపును నిలిపివేసి ,కాజీపేట వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలని ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ అన్నారు. కాజీపేట రైల్వే గార్డ్, డ్రైవర్ల క్రూ లింక్ ను విజయవాడకు తరలించినందుకు నిరసనగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ ముందు చేపట్టిన ధర్నాలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆక్రమ అరెస్ట్ లతో కేంద్ర ప్రభుత్వం త‌మ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. శాంతియుతంగా నిరసనగా తెలుపుతున్న త‌మ గులాబీ సైనికులను కేంద్ర ప్రభుత్వం ఆక్రమంగా కేసులు పెట్టారన్నారు.

క్రూ లింక్ లను తరలించి రైల్వే డ్రైవర్ల పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుందన్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తున్న రైల్లు నడుపుతున్న వారిపై ఒత్తిడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్న ప్రతి రైలు ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం క్రూ లింక్ తరలింపును వెనక్కి తీసుకొనే వరకు త‌మ పోరాటం ఆగదన్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు వేసిన ట్యాక్స్ ల రద్దుకై అనేక సార్లు జీయం ను కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ధర్నాలో పాల్గొన్న గులాబీ సైనికులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట ప్రాంత అభివృద్ధికి కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకెళ్తామ‌ని విన‌య్ భాస్క‌ర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement