Saturday, March 2, 2024

Warangal | పొలం దున్నుతుండగా వ్యవసాయ బావిలో పడిన ట్రాక్టర్‌.. డ్రైవర్‌ మృతి

వరంగల్‌: ట్రాక్టర్ తో చెలుక దున్నుతున్న వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున అదుపుతప్పి ట్రాక్టర్ తో సహా వ్యవసాయ బావిలో పడడంతో వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం లింగాపురం గ్రామ పరిధిలోని మేగ్యా తండాకు చెందిన అజ్మీర కీమా(45) తన చిన్నాన కుమారులైన అజ్మీర శివ, శ్రీను లకు చెందిన ట్రాక్టర్ కు అప్పుడప్పుడు డ్రైవర్ గా వెళ్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ట్రాక్టర్ తో చెలుక దున్నుతుండగా రివర్స్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ట్రాక్టర్ తో సహా పడిపోయి మరణించారు. కాగా బావిలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో మూడు మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లు బయటకు తోడి మృత దేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకెళ్లారు. మృతుడు కీమాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement