Tuesday, March 21, 2023

రైతు భూముల పట్టాల కోసం కదిలిన జిల్లా యంత్రాంగం..

నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కన్నరావుపేట రెవెన్యూ గ్రామంలో రైతుల భూముల పట్టాలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కదిలి ఏకంగా గ్రామంలోనే గ్రామ సభ ఏర్పాటు చేసిన సంఘటన చోటు చేసుకుంది. బుధవారం కన్నరావుపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ బి గోపి, అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట.. భూ రికార్డుల జిల్లా అధికారితో పాటు నర్సంపేట మహేందర్ జి నల్లబెల్లి తహసిల్దార్ డి.మంజుల పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బి గోపి రైతులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పాత పట్టాదారు పాసు పుస్తకాలు గతంలో చేసిన ఎంజాయ్మెంట్ సర్వే వివరాలు పరిశీలిస్తూ మిగులు పట్టాలు చేసేందుకు పరిశీలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement