Tuesday, May 7, 2024

TS | బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

చెన్నారావుపేట (ప్రభ న్యూస్): మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు చెన్నారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాకు చెందిన బానోతు ఈరు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ‌ట్టు శ‌నివారం వెల్ల‌డించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏండ్ల‌ బాలిక.. పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా గ్రామ శివారులో దారుణానికి య‌త్నించాడ‌న్నారు. బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement