Saturday, May 4, 2024

సమ సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ… స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో స్వాతంత్ర్య సమర యోధుల బలిదానాలు, త్యాగాలను స్మరించుకుంటూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని సమ సమాజ నిర్మాణానికి అన్ని వర్గాలవారు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత్ అమృతోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఫ్రీడమ్ రన్ ను జిల్లా కలెక్టర్ బస్ స్టాండ్ చౌరస్తా వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బస్ స్టాండ్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఫ్రీడమ్ రన్ లో అధికారులు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్ కలెక్టరేట్ వద్ద చేరిన అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె నిఖిల మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధనలో ఎందరో మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాల ఫలితంగానే నేడు మనకు స్వేచ్ఛ సిద్దించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందని, ఇందుకుగాను 75 వారాలపాటు స్వతంత్ర భారత్ అమృతోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా ఏప్రిల్ 3 న జిల్లాలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు, ఇందులో జిల్లాలోని కవులందరు పాల్గొనాలని అన్నారు. ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిసిపి బి. శ్రీనివాస రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, జనగామ మున్సిపల్ చైర్మన్ పి. జమున, ఏసీపీ వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement