Thursday, May 2, 2024

ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. ప్రజా చైతన్య యాత్రలో సునిల్ రెడ్డి

మహాదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, చిన్న కాళేశ్వరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, కన్న పెళ్లి, బీర సాగర్ గ్రామాలలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సునీల్ రెడ్డి ఇంటి ఇంటికి తిరుగుతూ కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామాలలో జెండాలను ఆవిష్కరణ చేస్తూ , బైక్ ర్యాలీ లు తీశారు. కన్నెపల్లి గ్రామం లో సుమారు 50 మంది యువకులు సునీల్ సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణం కొరకు కన్నపెల్లి గ్రామంలోని రైతులు తమ విలువైన భూములను ఇచ్చారు. ఎకరానికి ఐదు లక్షలు నష్టపరిహారం చెల్లించి తమ భూములను లాక్కొని రైతులను ప్రభుత్వం విస్మరిసతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

కాటారం, మహాదేవపూర్ మలహర్, మహ ముత్తారం మండలాల్లోని సుమారు 40000 ఎకరాలకు సాగునీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకపోవడం శోచనీయమని అన్నారు. తక్షణమే త్వరితగతిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో వారి వెంట మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి, యాత్ర ప్రముఖ్ వెన్నం పెల్లి పాపయ్య, మంథని నియోజకవర్గ ప్రబరి కాటంగురి అనిల్ రెడ్డి, మండల అధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ, యాత్ర సహ ప్రముఖ్, దుర్గం తిరుపతి, మండల ఇంచార్జ్ ఉడుముల విజయ రెడ్డి, వివిధ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మల్కా మోహన్ రావ్, పిలుమరి సంపత్, పార్లమెంట్ ఐటీ సెల్ కన్వీనర్ భీమారపు సంపత్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్, మండల ప్రధాన కార్యదర్శిలు బొల్లం కిషన్, సూరం మహేష్, మంథని రాజేందర్, గంట అంకన్న, పూసల రాజేంద్రప్రసాద్, మేడిపల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement