Friday, May 3, 2024

డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు… రూ.52 లక్షల గంజాయి బ్యాగులు స్వాధీనం : వైభవ్ గైక్వాడ్

వరంగల్ క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా జోరుగా నిరాటంకంగా సాగుతోంది. ఒరిస్సా రాష్ట్రంలో డ్రై గంజాయిని కొనుగోలు చేస్తూ పోలీసుల కళ్ళుగప్పి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా దందా యద్దేచ్చగా కొనసాగుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు సరి కొత్త ఎత్తులు వేస్తూ డ్రై గంజాయిని జిల్లాలు కాదు, రాష్ట్రాలనే సునాయాసంగా దాటిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ పెట్టారు. టాస్క్ ఫోర్స్ టీం ఎఫ్ఫోర్ట్స్ తో పక్కా సమాచారం అందుకొన్నారు. భారీ మొత్తంలో రెండు వాహనాల్లో డ్రై గంజాయి అక్రమ రవాణా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్. సంతోష్ డ్రగ్
మాఫియా గుట్టును బట్టబయలు చేయడానికై భద్రాచలం నుండి గంజాయి స్మగ్లర్లను వెంబడించి, మడికొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఔటర్ రింగ్ రోడ్డులోని టేకులగూడెం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకొన్నారు.

ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లా కలిమేల గ్రామం నుండి 504 కిలోల డ్రై గంజాయిని రెండేసి కిలోల చొప్పున విభజించి, విడివిడిగా 252 ప్యాకెట్లుగా తయారు చేసుకొని, రెండు వాహనాల్లో సమానంగా చేసుకొని ఎవ్వరికీ,ఎలాంటి అనుమానం రాకుండ జాగ్రత్తలు తీసుకొని డిక్కీలో అమార్చుకొని, మహారాష్ట్రలోని తుల్జాపూర్ కు బయలుదేరారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానించిన్నట్టే అవుటర్ రింగ్ రోడ్డు లోని టేకులగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను ఆపి,తనిఖీ చేయడంతో గంజాయి స్మగ్లింగ్ బాగోతం బయటపడింది. 52 లక్షల 40 వేల విలువగల 504 కిలోల డ్రై గంజాయి పట్టుబడింది. 7 మొబైల్ ఫోన్స్, రెండు వాహనాలు (మహేంద్ర ఎస్ యు వి ఎపి 29 బివి 3663, హోండా వర్ణ ఎపి 09 సి డబ్ల్యూ 6043) సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సంతోష్ ను, అతని టీం ను అడిషనల్ డిసిపి వైభవ్ గైక్వాడ్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement