Wednesday, May 8, 2024

అగ్నిపథ్ ను రద్దు చేయాలని సీపీఐ నిరసన

హన్మకొండ : మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని హ‌న్మ‌కొండ జిల్లా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప‌ట్టారు. హన్మకొండ లోని కాళోజీ విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళపల్లి శ్రీనివాస్ రావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, నాయకులు మద్దెల ఎల్లేష్, మండ సదాలక్ష్మి, కొట్టెపాక రవి, కండె నర్సయ్య, ఎం. బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement