Thursday, May 9, 2024

కార్మిక హక్కులను కాల రాస్తున్న కేంద్రం: సీపీఐ

హన్మకొండ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మేడే సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాల సవరణ పేరుతో మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తున్నదన్నారు. మేడే స్పూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకు మరో ఉద్యమానికి కార్మిక వర్గం సిద్దం కావాలన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడం కోసం పోరాటాలను ఉదృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణకు జరిగే పోరాటాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య,పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement