Friday, May 3, 2024

డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలిచే దమ్ముందా…? – టీఆర్ఎస్, బీజేపీ లకు సిపిఐ సవాల్


వరంగల్ ప్రజలను వంచించిన టీఆర్ఎస్, బీజేపీ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
వరంగల్ – మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు డబ్బులు పంచకుండా గెలిచే దమ్ముందా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు సవాల్ విసిరారు.
సిపిఐ అభ్యర్థులుగా గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారికి బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో శ్రీనివాసరావు బీ ఫారాలను అందజేశానారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజలను మోసం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీ లు పోటీ పడ్డాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. వరంగల్ పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరిచాయని అన్నారు. నిధులు ఇవ్వకుండానే ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఏటా 300 కోట్లు ఇచ్చామని ప్రచారం మాత్రం ఘనంగా నిర్వహించి ఆచరణలో మాత్రం శూన్యహస్తం చూపారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గజ్వేల్, సిద్దిపేట పై వున్న ప్రేమ వరంగల్ పై లేదని, ప్రస్తుతం ఎన్నికలు వచ్చినందున హామీలపై హామీలు గుప్పిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా తీరని అన్యాయం చేసిందని, ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచే దమ్ము ఆ పార్టీలకు లేదని నేను, ప్రజల పక్షాల పోరాడే వామ పక్షాలనే గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి,నగర కార్యదర్శి బాష్ మియా, జిల్లా నాయకులు తోట బిక్షపతి,గన్నారపు రమేష్,మద్దెల ఎల్లేష్,బుస్సా రవీందర్,దండు లక్ష్మణ్,సండ్ర కుమార్, మునిగాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement