Friday, April 19, 2024

ఓటిటి లో సుల్తాన్…రిలీజ్ డేట్ తెలుసా ?

బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం సుల్తాన్. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో కార్తీ సరసన రష్మిక మందన్న నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే గతేడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా సినిమాలు ఓటీటీ లకు ప్రాముఖ్యతనిస్తూ రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీ లో కూడా ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు సుల్తాన్ సినిమా కూడా ఓటిటి లో రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే తెలుగు వెర్షన్ ఆహా లో స్ట్రీమ్ కానుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ను మాత్రం సంస్థ రిలీజ్ చెయ్యలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement