Saturday, May 4, 2024

ట్రాక్టర్ పై పర్యటిస్తూ.. వరద పరిస్థితిని పరిశీలించిన సీపీ రంగనాథ్

గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో… నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వరంగల్ హంటర్ రోడ్ లోని ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్ లలో పూర్తిగా వరద నీరు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కల్సి ట్రాక్టర్ లో ప్రయాణించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు.

కాలనీల్లో వరద నీరు చేరుకోవడంతో ఈ కాలనీల్లో నివాసం వుంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలింపు విషయమై పోలీస్ కమిషనర్ వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, మట్టేవాడ ఇన్స్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకుడు గందే నవీన్ ను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు :

- Advertisement -

హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్ లలో పెద్ద స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో పోలీస్ కమిషనర్, జిల్లా కలేక్టర్ ఆదేశాల మేరకు మట్టేవాడ పోలీసులు వరంగల్ ఏసీపీ కిషన్, ఇన్స్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, గ్రేటర్ వరంగల్ మన్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్తంగా కల్సి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను బొట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement