Monday, April 29, 2024

ఎన్నికల విధులకు ఆటంకం క‌లిగిస్తే క‌ఠిణ‌ చర్యలు – వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి: పుష్ప

వరంగల్ క్రైమ్ – ఎమ్మెల్సీ ఎన్నికలను సవ్యంగా,సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్నీ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టిన్నట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డి సి పి పుష్ప స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డు,అవరోధాలు కలిగించే సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టిస్తామని ఆమె హెచ్చారించారు. పట్టభద్రులు పూర్తి స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డిసిపి పుష్ప ప్రకటించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగబోయే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు,బందోబస్తుపై వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోని పోలీస్ అధికారులతో డిసిపి పుష్ప సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు గాను నిర్వహించాల్సిన బందోబస్తుపై సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్ప అధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఎర్పాటు చేశారు.ఈ సమాచేశంలో ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, నిర్వహించకూడని విధులపై సెంట్రల్ జోన్ ఇంఛార్జ్ డి.సి.పి పుష్ప వివరించారు. ఎన్నికలు పూర్తి ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను పోలీస్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక స్టైకింగ్ ఫోర్స్ ను సైతం అందుబాటులో ఉంచడం జరుగుతుందని డి.సి.పి పుష్ప చెప్పారు.ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిసిపి పుష్ప హెచ్చరించారు. పట్టభద్రులు తప్ప,సంబంధం లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్దకు రావద్దని ఆమె సూచించారు. ఎన్నికలను పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని వరంగల్ సెంట్రల్ జోన్ డి సి పి పుష్ప విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఎ.సి.పిలు జితేందర్ రెడ్ది, రవీందర్ కుమార్, గిరికుమార్ తో పాటు, సెంట్రల్ జోన్ కు చెందిన ఇన్స్ స్పెక్టర్లు,సబ్ ఇన్స్ స్పెక్టర్లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement