Thursday, April 25, 2024

అభిమానం..60అడుగుల భారీ చిత్రం..

హైదరాబాద్ : మార్చి 13న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పబ్బ సాయిప్రసాద్‌.. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 60 అడుగుల భారీ చిత్రం వేయించాడు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి చేతుల్లో ఈ అద్భుత చిత్రం రూపుదిద్దుకున్నది. దీనిని పూర్తిచేయడానికి కళాకారులు 20 గంటలకుపైగా శ్రమించారు. సందర్శకులను ఈ చిత్రం అమితంగా ఆకర్షిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement