Thursday, May 9, 2024

క్రికెట్ బెట్టింగ్స్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

వరంగల్ కేంద్రంగా కొన్నాళ్లుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా టాస్క్ ఫోర్స్ టీం వరుస దాడులు చేస్తూ ILP క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళ భరతం పడుతున్నారు. ఆదివారం నగరంలోని కాశిబుగ్గలో క్రికెట్ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నట్టుగా వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.సంతోష్ పక్కా సమాచారం అందుకున్నారు. టాస్క్ ఫోర్స్  పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను కాశీబుగ్గలో పట్టుకున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్నట్టు గుర్తించి,అరెస్ట్ చేశారు. ఇంతేజార్‌ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్స్ లో డాఫాబెట్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తూన్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.

సాఫ్ట్ వేర్ జాబ్ చేసే తోట.సాయి విశాల్ (28, శివాలయం దగ్గర, కాశీబుగ్గ, వరంగల్) మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బొట్ల ప్రభు (25 ,లోతుకుంట, ఎల్బీ నగర్, వరంగల్)లను అరెస్ట్ చేశారు. డాఫాబెట్ యాప్‌లో 50 వేల నగదు,రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.తదుపరి చర్యల కోసమై ఇంతేజార్ గంజ్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement