Saturday, April 27, 2024

బీర్ కావాల‌ని నెటిజ‌న్ ట్వీట్ – ఫ‌న్నీ రిప్లై ఇచ్చిన న‌టుడు సోనూసూద్

న‌టుడు సోనూసూద్ కి ఫ‌న్నీ కామెంట్ చేశాడు ఓ నెటిజ‌న్..అదేంటంటే చల్లి కాలంలో దుప్పట్లను పంచారు. ఈ నేపథ్యంలోనే మండుటెండల్లో వేసవి కాలం కాబట్టి చల్లని బీరు అందిస్తే బాగుంటుంది’ అని సోనుసూద్ ను ట్వి్ట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఈ విషయమై స్పందించాలని సోనుసూద్ ను కోరారు. కాగా, నెటిజన్ రిక్వెస్ట్ కు ఫన్నీగా రియాక్ట్ అయి తనదైన స్టైల్ లో రిప్లయి ఇచ్చారు రియల్ హీరో సోనుభాయ్. ‘బీర్ తో పాటు స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది కదా’ అని ట్వీట్ ద్వారా రిప్లయి ఇచ్చారు. అది చూసి నెటిజన్లు ‘వావ్ సోనుభాయ్ ఎపిక్ రిప్లయి’, ‘యూఆర్ గ్రేట్’, ‘సూపర్ రిప్లయి’, గ్రేట్ బాస్’ అని కామెంట్స్ చేస్తు్న్నారు. సోనుసూద్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో చాలా చిత్రాల్లో ప్రతి కథానాయకుడి పాత్ర పోషించిన సోనుసూద్.. ఈ నెల 29న విడుదల కానున్న మెగాస్టార్ ‘ఆచార్య’ ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేశారు. ‘తమిళరసన్, ఫతేహ్’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్న సోనుసూద్.. ‘రోడీస్ 18’ సీజన్ కు హోస్ట్ గానూ వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement