Thursday, May 16, 2024

సైబర్  నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలి: సీపీ తరుణ్ జోషి

ప్రజలు అప్రమత్తంగా వుంటూ సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రజలకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు రోజు, రోజుకి పెరిగి పోతున్నాయని అన్నారు. టెక్నాలజీ వినియోగించుకోని సైబర్ నేరగాళ్ళు  చేతులో మోసపోయి డబ్బులు పోగోట్టుకున్నారని చెప్పారు. సైబర్ క్రైం పోర్టల్ హెల్ప్ లైన్ నంబర్ 155260కు డయల్ చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు. సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయిన బాధితులు 24గంటల లోపు సైబర్ క్రైం హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని సూచించారు. దీంతో బాధితులకు సకాలం న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఫోన్లకు గుర్తుతెలియని వ్యక్తులు సంస్థల నుండి  అనుమానస్పదంగా వచ్చే లింక్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత సమాచారంతో పాటు మీ బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో పోతాయని సీపీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement