Monday, May 20, 2024

అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోండి… ఉన్న‌తంగా ఎద‌గండిః హ‌రిత

మొయినాబాద్. .. నేటి వేగవంతమైన ప్రపంచంలో సాంకేతిక శాస్త్ర రంగాలను యువత అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడుతూ ఎదుటివారికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి ఎం హరిత అన్నారు శనివారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ రెవిన్యూ లో గల అజీజ్ నగర్ చౌరస్తాలో ఉన్న విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆప్ హైదరాబాద్ 2022-23 లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం 2023 ఆగస్టు 19న 21వ గ్రాడ్యుయేషన్ డేని కన్నుల పండుగగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం.హరిత గ్రాడ్యుయేట్‌లను అభినందించి గ్రాడ్యుయేట్‌లు తాము ఎంచుకున్న రంగాలలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు నేటి యువత సన్మార్గంలో ప్రయాణించి వారికి అనుకూలంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కళాశాల తో పాటు తల్లిదండ్రులకు సైతం పేరు ప్రఖ్యాత తీసుకురావాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉందని అన్నారు.

గౌరవ అతిథి శ్రీ సౌగత సేన్ తో పాటూ గ్రాడ్యుయేట్‌లకు పట్టాలను ప్రదానం చేశారు. 2023 బ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టి.నికిత , డి.దీక్షితలకు దివంగత శ్రీ పల్లా రాఘవ రెడ్డి స్మారక బంగారు, రజత పురస్కారాలు లభించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. సాయిబాబా రెడ్డి, డీన్ డాక్టర్ ఎ. పద్మజ, అకడమిక్ కోఆర్డినేటర్ జి. శ్రీలత, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎ. వెంకటాచలం, గ్రాడ్యుయేషన్ డే కన్వీనర్ డాక్టర్ వివి సత్యనారాయణ, వివిధ విభాగ అధిపతులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement