Saturday, May 18, 2024

TS : మెట్రో ప్ర‌యాణీకుల‌కు ఉగాది కానుక‌… నేటి నుంచి మూడు ఆఫ‌ర్లు….

ఉగాది సందర్భగా మెట్రో ప్ర‌యాణీకుల‌కు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైలు. ఇవాళ్టి నుంచి మూడు ప్రత్యేక ఆఫర్లు మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఉగాది సందర్భంగా నేటి నుంచి ఆ మూడు ఆఫర్లు మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ప్రకటించారు.

- Advertisement -

మెట్రో ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు నేటి నుంచి 6 నెలల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి..

ఇక, కొత్త మూడు ఆఫర్లపై హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు కోసం ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ సరికొత్తగా కస్టమర్‌ లాయల్టీ ప్రోగ్రాంను పరిచయం చేస్తుందని పేర్కొన్నారు.. ఇవి మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో వెసులుబాటు కల్పిస్తాయని.. ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే ఎక్కువ రివార్డులు పొందవచ్చు అని వెల్లడించారు.. మరోవైపు.. కొత్తగా ప్రారంభించిన కస్టమర్‌ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా మెట్రో ప్రయాణికులు ఎంతో లబ్ధి పొందుతారని చెప్పుకొచ్చారు ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి.. ప్రయాణికుల నుంచి వస్తుందన్న స్పందన, అభ్యర్థనలతో ఈ ఉగాది రోజున మేం ఈ ఆఫర్‌లను తిరిగి పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. మేం సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ మరియు మెట్రో స్టూడెంట్ పాస్‌లను మళ్లీ ప్రారంభించినందున, ఏప్రిల్ 9, 2024 నుంచి అంటే ఇవాళ్టి నుంచి 6 నెలల వరకు ఈ ఆఫర్‌లను పొందవచ్చు.. మీరు మాతో ప్రయాణిస్తున్నప్పుడు అసాధారణమైన పొదుపులు మరియు సౌకర్యాన్ని పొందుతారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు.

మొత్తంగా ‘సూపర్ సేవర్ హాలిడే కార్డ్’ చెల్లుబాటును మరో ఆరు నెలల పాటు పొడిగించింది.. అంటే మెట్రో ప్రయాణికులు ఏ సెలవు దినమైనా రూ.59కే ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, ‘స్టూడెంట్ పాస్‌ల’ చెల్లుబాటును మరో ఆరు నెలల పాటు పొడిగించారు. HMRL తన ‘సూపర్ ఆఫ్-పీక్ ఆఫర్’ ఆఫర్ ద్వారా రద్దీ లేని సమయాల్లో ప్రయాణంపై 10 శాతం తగ్గింపును ప్రకటించింది. కాగా, HMRL మార్చి 31న ఈ అన్ని కార్డుల ప్రయోజనాలకు స్వస్తి చెప్పింది.. అయితే, మెట్రో వినియోగదారుల నుండి వచ్చిన విజ్ఞప్థులతో ఉగాది కానుకగా ఈ ప్రత్యేక ప్రయాణ తగ్గింపులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement