Thursday, May 16, 2024

దీపావళి వేడుకల్లో ట్విన్స్ కొబ్బరి.. ఎక్క‌డో తెలుసా..

పెద్దపల్లి పట్టణంలో వింత చోటుచేసుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన పూజలో కొబ్బరికాయ కొట్టగా అందులో ట్విన్స్ కొబ్బరి కుడుక లు బయటపడ్డాయి.
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని చందర్ కాక నగర్ లో గణపతి రైస్ మిల్ యజమాని ఇంట్లో భారతి గణపతి దీపావళి పూజలో భాగంగా కొబ్బరికాయ కొట్టగా జంట కొబ్బరి బయటపడింది. దీంతో ఆశ్చర్యానికి గురైన భారతి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీపావళి పర్వదినం రోజున జంట కొబ్బరి రావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 50 సంవత్సరాల్లో ఇటువంటి కొబ్బరిని తామేప్పుడూ చూడలేదని వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement