Sunday, May 19, 2024

TS: డెంటల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌.. 28వ తేదీ దాకా అప్లికేషన్లకు చాన్స్‌

Warangal: రాష్ట్రంలోని ప్రైవేట్‌ దంతవైద్య కళాశాలల్లో పీజీ డెంటల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు చేసుకోవాలని తెలిపింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

యాజమాన్య కోటా సీట్లకు అభ్యర్థులు 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నిర్దేశిత నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత సర్టిఫికెట్లు స్కాన్‌ చేసి వెబ్‌ సైట్‌లో అప్‌ లోడ్‌ చేయాలని తెలిపింది. దరఖాస్తులు ధ్రుపత్రాలను పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ- తుది మెరిట్‌ జాబితా విడుదల చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement