Friday, April 26, 2024

TS – ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచార‌ణ‌ – బిజెపి ఎంపి ల‌క్ష్మ‌ణ్ డిమాండ్

హైద‌రాబాద్ – అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడు కాద‌ని, .. గ్రీక్ వీరుడు అని నిరూపించుకోవాలని అనుకుంటే ఫోన్ టాపింగ్ వ్యవహారం నీ సీబీఐ విచారణ జరపాలన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పాత్ర దారులతో పాటు సూత్ర దారులను కూడా బయట పెట్టాలన్నారు.

లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యార‌ని అంటూ పోన్ టాపింగ్ లో ఆ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు ల‌క్ష్మ‌ణ్. కాళేశ్వరంలో కూడా ఆ కుటుంబం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయ‌ని … వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యారు తప్ప చర్యలు లేవన్నారు. ధరణి పై చర్యలు లేవ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క దరఖాస్తును కూడా పరిస్కరించలేదన్నారు.

మియాపూర్ భూములు, డ్రగ్స్ కేసులు పత్తా లేవన్నారు. తాజాగా పోన్ టాపింగ్ వ్యవహారం ..ప్రముఖుల పోన్ టాపింగ్ జరిగాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఒకరిద్దరు జరిగితే జరగొచ్చు అని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు మాత్రం ప్రభుత్వం చెపితేనే చేశామని అంటున్నారన్నారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా ఉంది కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల పరిస్థితి అంటూ మండిపడ్డారు. నియంతృత్వ పాలన చేసేవారు తమ నీడను కూడా తాము నమ్మరన్నారు. అందులో భాగమే పోన్ టాపింగ్ అన్నారు. ఫోన్ టాపింగ్ తో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. పోన్ టాపింగ్ సామాన్యమైనదికాదన్నారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా చేయకూడదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement