Thursday, May 2, 2024

TS – ఓఆర్ఆర్ లో హిట్ అండ్ ర‌న్ – ఆర్మీ జ‌వాన్ దుర్మ‌ర‌ణం

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు హిట్ అండ్ రన్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంట్రీ. ఎక్సైట్ సి సి ఫోటొజ్ పరిశీలిస్తున్న కాప్స్ .నార్సింగీ హిట్ అండ్ రన్ కేసు లో మృతుడు ఆర్మీ సోల్జర్ కులాన్. గా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అనే వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు..అలాగే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాహ‌నాన్ని గుర్తించేందుకు సిసి టివి ఫుటేజ్ ను ప‌రిశీలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement