Thursday, May 2, 2024

తెలంగాణలో అప్పులు లేని రైతులు.. రూ.50 వేల వరకు రుణమాఫీ..

తెలంగాణ రైతుల శ్రేయ‌స్సు కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పులు లేని రైతులుగా చూడాల‌నేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం అని ఆయ‌న‌ పేర్కొన్నారు. 2014లో రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన వాగ్దానం మేర‌కు.. 35.19 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 16,144.10 కోట్ల రుణాల‌ను మాఫీ చేశామ‌న్నారు. 2018లో కూడా రైతుల రుణ‌మాఫీ కోసం వాగ్దానం ఇచ్చామన్న కేటీఆర్.. క‌రోనా స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వం త‌న వాగ్దానాన్ని నిల‌బెట్టుకుందని గుర్తు చేశారు. రూ. 50 వేల వ‌ర‌కు రుణ‌మాఫీ ద్వారా 9 ల‌క్ష‌ల మంది రైతుల‌కు సాయం చేశామ‌ని తెలిపారు. రుణ‌మాఫీ చేసిన సీఎం కేసీఆర్‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement