Thursday, April 25, 2024

Flash: ఈ నెలఖరు వరకే ట్రాఫిక్ చలాన్ల రాయితీ.. తరువాత సీన్ వేరే..

ట్రాఫిక్ చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 1.85 కోట్ల చలాన్లు క్లియర్ కాగా.. ఈ చలాన్ల ద్వారా రాయితీ పోగా రూ. 190 కోట్లు వసూలయ్యాయి. రోజుకు 7 నుంచి 10 లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయి. ఈ మేరకు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 31 వరకే చలాన్లపై రాయితీ సదుపాయం ఉంటుందని… ఈ రాయితీ గడువును పొడిగించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ నెల నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఛార్జిషీట్లు వేస్తామని హెచ్చరించారు. టార్గెట్లు పెట్టుకుని చలాన్లు వసూలు చేయాలనే ఆలోచన తమకు లేదని తెలిపారు. ఓవరాల్ గా 60 నుంచి 70 శాతం చలాన్లు క్లియర్ అవుతాయని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement