Sunday, April 28, 2024

TS : నేడు ,రేపు మంట‌లే…. ఎల్లుండి నుంచి వాన‌లు

తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఎల్లుండి నుంచి ఐదు రోజులపాటు రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. అలాగే నేడు,రేపు మరికొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు వచ్చే ఐదు రోజులపాటు ఉండే వాతావరణ పరిస్థితులపై శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది.

- Advertisement -

న‌ల్గొండ‌లో 45.2డిగ్రీల ఉష్ణోగ్రత
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో మాడు పగిలేంతగా ఎండప్రభావం కనిపించింది. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 45.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధజిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి, తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి.

రెండు రోజులూ మంటలే…
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చు. ఇప్ప‌టికే 43 డిగ్రీలు ఉష్ణ‌తాపం ఉండ‌గా అది 46 డిగ్రీల‌కు చేరుకోవ‌చ్చ‌ని పేర్కంది..

ఆదివారం నుంచి వర్షాలు కురిసే జిల్లాలు
నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవొచ్చు.

22, 23 తేదీల్లో వర్షాలు పడే జిల్లాలు
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మిగతా రెండు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement