Wednesday, May 15, 2024

కరీంనగర్ లో నేడు 144 సెక్షన్ – సిపి సుబ్బరాయుడు

కరీంనగర్ – నేటి ఉదయం 6 గంటల నుండి కరీంనగర్ నగరం లోని ఐబి చౌరస్తా, గ్రేవ్ యార్డ్, జైలు పరిసర ప్రాంతాలు, వెంకటేశ్వర టెంపుల్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి నట్లు పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు తెలిపారు.ప్రజలు ఎవరు గుమి కూడా రాదన్నారు.ఊరేగింపులు తీయరాదని,సమావేశాలు నిర్వహించరాదన్నారు.అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ మళ్లింపు కూడా ఉన్నందున అటువైపు వాహనాలు కూడా అనుమతించబడవన్నారు.కావున ప్రజలందరూ దీన్ని గమనించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement