Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 40
40.
నమ: పురస్తాదథ పృష్ఠతస్తే
నమోస్తుతే సర్వత ఏవ సర్వ |
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోసి సర్వ: ||

తాత్పర్యము : నీకు ముందునుండి, వెనుకనుండి, సర్వదిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంతవీర్యా! నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి యున్నావు.

భాష్యము : అర్జునుడు ఎంతో తన్మయత్వముల కృష్ణునికి అన్ని వైపుల నుండి ప్రణామములను అర్పించుచున్నాడు. శ్రీకృష్ణుడు అమోఘమైన శక్తి పరాక్రమము కలిగిన వాడని, కురుక్షేత్ర రణరంగమున ఉన్న వీరులందరికంటే ఎంతో ఉన్నతుడని కీర్తించుచున్నాడు. ఎటువంటి వ్యక్తి భగవంతుని సమక్షమునకు వచ్చినా, చివరకు ఏ దేవత అయినా ఆయన నుండి సృష్టింపబడినవారే అయి ఉంటారని విష్ణు పురాణములో తెలియజేయుట మయినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement