Saturday, April 27, 2024

Breaking: బీఎస్సీ నర్సింగ్ లో చేరేందుకు.. 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు

వరంగల్ (ప్రభ న్యూస్ ప్రతినిధి) : బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్ టీ, బీపిటి కోర్సుల్లో ప్రవేశాలకు వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం సాయంత్రం వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ ఉదయం 8గంటల నుండి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో కళాశాల, కోర్సు వారిగా, ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement