Thursday, May 2, 2024

TS: వారంటీ అయిపోయిన పార్టీ గ్యారంటీ అంటోంది.. కాంగ్రెస్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ప్రభ న్యూస్, గ్రేటర్ హైదరాబాద్ : వారంటీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ, గ్యారంటీ స్కీములతో ప్రజలను వంచించేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లోని హోటల్ మినర్వలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 30శాతం కమీషన్ తీసుకుంటుందన్న ఆవేదనతో కర్ణాటక ప్రజలు, బీజేపీని ఓడించి కాంగ్రెసు పార్టీకి అధికారం కట్టపెట్టారని, అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, అందివచ్చిన అవకాశంగా 50శాతం కమీషన్ తీసుకుంటోందని మండిపడ్డారు.

అవినీతిలో కాంగ్రెస్ – బీజేపీలు ఒకదానిపై మరొకటి పోటీ పడుతున్నాయని, ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభివృద్ధి కోసం ఆరాట పడుతోందన్నారు. ఇంటింటికి కుళాయి నీరు, రైతు బంధు, మహిళా బంధు వంటి అనేక పథకాలను అమలు చేయడం ద్వారా మూడోసారి అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటంతోనే 33 శాతం రిజర్వేషన్లకు అడుగు పడిందని, ఈ ఘనత కవితదేనన్నారు. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముద్రబోయిన శ్రీనివాస్, జిన్నారం విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖరరెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, భవానీ ప్రవీణ్ కుమార్, పద్మా నాయక్, సంగీతా రెడ్డి, తిరుమల రెడ్డి, వెంకటేశ్వరరావు, గజ్జల మధుసూదన్ రెడ్డి, సాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement