Monday, April 29, 2024

టెర్ర‌రిస్ట్ స్లీప‌ర్ సెల్స్ హ‌బ్ గా హైద‌రాబాద్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఐ హైదరాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్‌ సలీం అలియాస్‌ సౌరభ్ రాజ్‌ 2018వ సంవ త్సరంలోనే భోపాల్‌ నుంచి ఇక్కడకు వచ్చి ఓ వ్యాపార వేత్త సిఫారసుతో పేరొందిన వైద్య కళాశాలలో అధ్యాపకు డిగా ఉద్యోగంలో చేరినట్టు పోలీసుల విచారణలో బయట పడింది. అంతకు ముందు భోపాల్‌లో ఓ మదర్సాలో టీచర్‌గా పనిచేసినట్టు సమాచారం. హైదరాబాద్‌ వచ్చాక తన కార్యకలాపాలను ముమ్మరం చేశాడని భాగ్యనగరాన్ని స్లీపర్‌ సెల్‌గా వాడు కున్నాడని పోలీసలు నిర్ధారించారు హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని భయానక వాతావరణం సృష్టించేందుకు పన్నాగం పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.

ఐటీ నిపుణుల ముసుగులో
ఐటీ నిపుణుల ముసుగులో కొందరు ఉగ్ర వాదులు హైదరాబాద్‌లో తల దాచుకుని తమ కార్య క్రమాలు నిర్వహస్తున్నట్టు చెబుతున్నారు. కాగా పోలీసులకు దొరికిన అనుమానితులను హజబ్‌ ఉట్ తె హర్‌ సంస్థతో సంబంధాలున్నట్టు మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ విభాగం (ఏటీఎస్‌) అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది .ప్రజాస్వామ్యదేశాలే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడేలా కుట్రలకు వ్యూహం రచించినట్టు ప్రాధమిక విచారణలో బయటపడినట్టు సమాచారం. సుమారు 50 దేశాల్లో కార్యకలాపాలు, 16 దేశాల్లో ##హచ్‌యూటీపై నిషేధం విధించారు. మరోవైపు #దరాబాద్‌లో అరెస్ట్‌ అయిన ఆరుగురు నిందితులను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలోనే వారిని సీన్‌రీకన్‌ స్ట్రక్షన్‌ కోసం అధికారులు # హదరాబాద్‌కు తరలించనున్నారు. ఈ నిందితులను మే 19 వరకు ఏటీఎస్‌ విచారించనుంది
.
భోపాల్‌ టు హైదరాబాద్‌
ఈ ఉగ్రకుట్రలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. విచారణలో భోపాల్‌ టు హదరాబాద్‌ కు ఉగ్రవాదుల లింకులున్నట్టు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్‌వెబ్‌ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్‌ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది.

శిక్షణ కోసం 17 మంది రాక
ఉగ్రవాద శిక్షణలో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన 17మంది ఐఎస్‌ఐ తీవ్రవాద బృందం హదరాబాద్‌ వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడటంతో పోలీసు యంత్రాగం ఎక్కడి కక్కడ బందోబస్త్‌ ను ఉదృతం చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.. కేంద్ర ఇంటలిజెన్స్‌ సాయంతో భోపాల్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ను నిర్వహంచి 17మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రత్యేక భద్రత మధ్య మధ్యప్రదేశ్‌కు తరలించారు.
ఈ ఆపరేషన్‌లో మ హమ్మద్‌ సలీల్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌, షేక్‌ జునైద్‌, మ హమ్మద్‌ అబ్బాస్‌, #హమీద్‌ లను అధికారులు అరెస్ట్‌ చేశారు వీరిలో సలీమ్‌ ఓ మెడికల్‌ కాలేజీలో హచ్‌ఓడీగా పని చేస్తున్నాడు. అబ్దుల్‌ రెహ్మాన్‌ ఎంఎన్‌సీ కంపెనీలో క్లౌడ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. షేక్‌ జునైద్‌ పాతబస్తీలో డెంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. పట్టుబడ్డ వారికి హజ్బుత్ త హర్‌ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

ఉగ్రవాదుల టార్గెట్‌ #హదరాబాదే
ఉగ్రవాదులు ఎక్కడ పట్టుబడ్డ వారి లక్ష్యం #హదరాబాదే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు #హదరాబాద్‌ మహా నగరంలో ఐదు లక్షల సీసీ కెమెరాలు, బందోబస్తు విధుల్లో తిరిగే పెట్రోలింగ్‌ వా#హనాలు, నిఘా సంస్థలు…ఇవన్నీ నగరంలో భద్రతా నిమిత్తం ఉన్నప్పటికీ ఉగ్రవాదులు స్వేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా నిఘా వర్గాల దృష్టంతా #హదరాబాద్‌ వైపే ఉంటుంది. నగరంలో ఉగ్రవాద సంస్థల సానుభూతి పరులు, షెల్టర్‌ కోసం వచ్చిన వాళ్లు, స్లీపర్‌ సెల్స్‌ ఇలా ఎంతో మందిని దర్యాప్తు సంస్థలు ఇక్కడే అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. 2017లో ముగ్గురు యువకులు ఐసిస్‌లో చేరడానికి నగరం నుంచి బయల్దేరి కాశ్మీర్‌ సరి#హద్దులో దొరికిపోయారు. 2019లో మరికొంత మందిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌ చేసి వదిలేశారు. కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుడిని టోలిచౌకిలో అరెస్టు చేశారు.
గుట్టు చప్పుడు కాకుండా
తాజాగా అరెస్టయిన #హచ్‌యూటీ ఉగ్రవాదులు హదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలో ఉగ్రవాదుల వివరాలేమి ఇంటి యజమానులు అడిగి తెలుసుకోలేదు. వీరు భార్య, పిల్లలతో కలిసి ఇక్కడే జీవిస్తున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు అద్దెకు ఉన్నప్పటికీ స్థానికులతో ఎలాంటి పరిచయాలు పెంచుకోకుండా, వారి పిల్లల్ని ఇంట్లో ఉంచే చదివించడం ద్వారా వీరి వివరాలేవి బయటపడకుండా జాగ్రత్త పడ్డారని పోలీసు అధికారి తెలిపారు. జగద్గిరిగుట్ట మక్దూమ్‌నగర్‌లో ఉన్న మ హ్మద్ హమీద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు. అతడు ఉదయం 5 గంటలకు బయటకెళితే రాత్రి9కి ఇంటికి వచ్చేవాడని స్థానికులు తెలిపారు. ఆ ముగ్గురు పిల్లల్ని తాము ఇంతవరకు చూడలేదని చెప్పారు.

- Advertisement -

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అడవులు
హదరాబాద్‌ నగరంలో నిఘా ఎక్కువ ఉండటం వల్ల అసాంఘిక శక్తులు జ హరాబాద్‌, వికారాబాద్‌ అటవీ ప్రాంతాలను అడ్డాగా చేసుకుంటున్నాయి. గతంలో సిమీ ఉగ్రవాదులు, వికారుద్దీన్‌ ముఠా వికారాబాద్‌ అడవుల్లోనే తీవ్రవాద శిక్షణ తీసుకున్నాయి. ప్రస్తుతం అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదులు కూడా వికారాబాద్‌ అడవులలోనే కొన్ని మీటింగ్స్‌ పెట్టుకున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. వీరు అక్కడే శిక్షణ తీసుకున్నారా అనే కోణంలో అధికారులు ఆరాతీస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ల నుంచి దేశీయ పిస్తోళ్లు నగరానికి చేరుతున్నాయి. వీటిని కొన్న కొందరు పాత నేరస్థులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తుపాకీ కాల్చడంతో తర్ఫీదు కోసం వికారాబాద్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లోని ఫామ్‌#హౌస్‌లకు చేరుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో గన్‌తో అరెస్టయిన ఇద్దరు ఇదే ప్రాంతానికి చెందిన వారు. రియల్‌ వ్యాపారులు, రౌడీషీటర్లు, గంజాయి స్మగ్లర్ల పంచాయితీలకు జ#హరాబాద్‌ అనుకూల ప్రాంతంగా మారిందని ఓ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలకు సరి#హద్దున ఉండటం, అటవీ ప్రాంతం కావడంతో అసాంఘిక శక్తులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. తాజాగా బయటపడిన ఉగ్రకోణంతో పోలీసు అధికారులు ఈ రెండు ప్రాంతాలపై దృష్టి సారించారు. అవసరమైన అన్ని చర్యలకు సిద్ధమవుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement