Saturday, May 11, 2024

రిజిస్ట్రార్ ఛాంబ‌ర్ కు తాళం – తెలంగాణ విసి ఘ‌న‌కార్యం..

ఉమ్మడి నిజమాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలంగాణ యూనివర్సిటీ-లో మరో వివాదం నెల కొంది. వివాదస్పద నిర్ణయాలతో విశ్వవిద్యాల యం ప్రతిష్టను దిగజార్చుతున్న వీసీ రవీందర్‌ గుప్తా మరో వివాదానికి తెరలేపారు. నిజామా బాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెయూ యూనివర్సిటీ- గడిచిన రెండేళ్ళుగా వివాదాల పుట్టగా మారింది. మళ్ళీ సో మవారం ఉదయం పరిపాలన భవనంలోని రిజిస్ట్రార్‌ ఛాంబర్‌కు తాళం వేసి వుంది. ఉదయమే రిజిస్ట్రార్‌ యూనివర్సిటీ-కి వచ్చారు. తన ఛాంబర్‌కు తాళం వేసి ఉండడంతో సెక్యూరిటీ- సిబ్బందిని అడిగినప్పటికీ తమకు తెలియదంటూ- దాటవేశారు. వీసీ ఆచార్య రవీందర్‌ గుప్తా సెక్యూరిటీ- అధికారికి ఫోన్‌ చేసి రిజిస్ట్రార్‌ గదికి తాళం వేయించినట్లు-గా అక్కడ మాట్లాడుకున్నారు. ఉదయమే యూ నివర్సిటీ-కి వచ్చిన రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి తాళం వేయించినట్లు- తెలి యడంలో కామర్స్‌ కళాశాల డిపార్ట్మెంట్‌లో కూర్చున్నారు. ఎవరు తాళం వేసిం ది తెలియకపోవడంతో చర్చగా మారింది. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్‌ యాదగిరిపై మొదటి నుంచి వీసీ రవీందర్‌ గుప్తా గుర్రుగా ఉన్నారు. ఇటీ-వల యాదగిరిని తొలగించి ఓయూకు చెందిన నిర్మాలదేవిని తెయూ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వీసీ ఆదేశాలు జారీచేశారు. దీంతో తమకు కనీస సమాచారం ఇవ్వ కుండా ఎలా రిజిస్ట్రార్‌ యాదగిరిని తొలగిస్తారని ఆగ్రహం చెందిన పాలకమండలి హైదరాబాద్‌ లో ఈసీ సమావేశం ఏర్పాటు- చేసి వీసీ అక్రమాలపై విచారణ, ముగ్గురు రిజిస్ట్రార్‌లపై చర్యలు చేపట్టాలని తీర్మానాలు చేశారు. ఏసీబీ, విజిలెన్స్‌ శాఖల అధికారులకు పిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement