Friday, September 20, 2024

అమెరికాలో భ‌ద్రాచ‌లం ఆల‌య నిర్మాణం…

భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్‌ ప్రతినిధి: దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంట ప్రాంతంలో రామాలయ నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉండే తెలుగు వారు భద్రాచలం రామాలయం నమూనా ప్రకారం ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో విగ్రహాల ప్రతిష్ట చేపట్టేందుకు అక్కడి నిర్వాహ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని ఆళ్లగడ్డకు చెందిన రిటైర్డు స్తపతి రాజేశ్వరాచారి పర్య వేక్షణలో సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, గరుత్మం తుడు శిల్పాలను చెక్కించారు. వీటిని ఆళ్లగడ్డ నుంచి సోమవా రం భద్రాచలం శ్రీరామ దివ్య క్షేత్రానికి తరలించారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన విగ్రహాలను ధాన్యదివాసం చేశారు. 40 రోజుల పాటు భద్రాచలంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నా రు. పూజల అనంతరం అమె రికాలోని అట్లాంటలో వీటిని ప్రతిష్టించేందుకు అట్లాంటకు చెందిన రామాలయ నిర్వా హకులు ఏర్పాట్లు చేస్తున్నా రు. అట్లాంటకు చెందిన రామాలయ అర్చకులు ఈ విగ్రహాల ను తీసుకుని భద్రాచలం చేరుకున్నారు. 2024లో ప్రతిష్టించే అట్లాంట రామాలయ విగ్రహ ప్రతిష్ట జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల ప్రక్రియ భద్రాచలంలో ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement