Sunday, April 28, 2024

TS: శాంతి భద్రతల సంరక్షణలో తెలంగాణ టాప్… కేటీఆర్

శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికతను వినియోగించుకోవడంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారని, అదే విధంగా పోలీసు సంక్షేమ చర్యలో భాగంగా దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ
తో కలిసి ప్రారంభించారు. అందులో భాగంగా మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన మహమూద్ అలీ అనంతరం శిలాఫలకంను ప్రారంభించి, ఆఫీస్ రిబ్బన్ కట్ చేసి అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను వేద మంత్రాల మధ్య ప్రారంభోత్సవం చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎస్పీ ఛాంబర్ ను సందర్శించి జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను చైర్ లో కూర్చో బెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, ఎంపి వెంకటేశ నేత, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువ, మెమెంటో తో సన్మానించారు. పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుందని, తెలంగాణ పోలీసులకు ఆధునిక భవనాలు, మంచి వాహనాలు సాంకేతికతను వినియోగించుకునే విధంగా అవసరమైన అన్ని పరికరాలను అందించామన్నారు.

రాష్ట్ర రాజధానికి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో సైతం ఆధునిక హంగులతో కూడిన భవనాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే అంశంలో మనుషులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని, ప్రజలకు మేలు చేసే పాలసీలను, వ్యవస్థల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, జిల్లా పోలీస్ కార్యాలయ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు రమణ, భాను ప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, రవిశంకర్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష , ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement