Monday, April 29, 2024

Srikakaulam – టిడిపి నేతల గృహనిర్బంధాలు…. ర్యాలీకి వెళ్ళనీయకుండా ముందస్తు అరెస్టులు…

శ్రీకాకుళం,అక్టోబర్ 3:. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా టిడిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా డే అండ్ నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు ముందస్తుగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను ఎక్కడికి అక్కడే అరెస్ట్ చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ శ్రీకాకుళంలో ఆయన గృహల్లో అరెస్టు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పలాస కు తరలించినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి, ఎచెర్ల నియోజకవర్గం ఇంచార్జ్ కిమిడి కళా వెంకట్రావును కూడా ఆయన క్యాంపు కార్యాలయంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా నరసన్నపేటలో బగ్గు రమణమూర్తిని, కొత్తూరులో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పలాసలో గౌతు శిరీషను ఇచ్చాపురంలో శాసనసభ్యులు బెందాళం అశోకుని పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.

పోలీసుల తీరుపై తెలుగుదేశం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగానైనా రాలీ నిర్వహించాలని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా, ప్రతిపక్షాల స్వేచ్ఛ హక్కులను భగ్నం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి నాయకులు కళా వెంకట్రావు, కూన రవికుమార్ మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement