Sunday, April 28, 2024

Telangana – మేం గేట్లు తెరిస్తే.. వరదే – మంత్రి పొంగులేటి

త్వరలో రెవెన్యూపై వైట్ పేపర్
ధరణి ఆ సర్కారు సీక్రెట్ సంస్థ
సీఎం వెంట ఉంటే.. నెంబర్ టూ ఎలా?
తాగునీటి సమస్యపైనే ప్రత్యేక దృష్టి
మిషన్ భగరీథను మరింత మెరుగు పర్చుతాం
మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి

మేం ఇంకా గేట్లు తెరవలేదు, తెరిస్తే వరద వస్తుంది అని మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ, త్వరలో రెవెన్యూ శాఖపై వైట్ పేపర్ విడుదల చేస్తాం, కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం, సీఎం అయ్యే స్థాయి నాకు లేదు, అది బేస్ లెస్ వాదన, ఆశలకు కూడా ఒక హద్దు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, మిషన్ భగీరథ అద్భుతమైనదని, ఇంకా మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతామని పొంగులేటి అన్నారు.

అందుబాటులో ఉన్న జలవనరులు పరిగణనలోకి తీసుకుని , తెలంగాణను మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దుతాం అన్నారు. ఇక గృహ నిర్మాణానికిప్రతియేటా 18 వేల నుంచి 20 వేల కోట్లు అంచనా వేశామన్నారు. ఇక ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతూ, అది ఆ ప్రభుత్వానికి ధరణి సీక్రెట్ సంస్థ, ఈ వ్యవస్థకు మేం దూరం అన్నారు. ఇక ముఖ్యమంత్రి వెంట ఉంటే రెండో స్థానం ఎలా అంటారు, మేం ఫోన్ ట్యాపింగ్ చెయ్యం.. ఆ అవకాశం మాకు అక్కర్లేదని పొంగులేటి వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనకాడబోమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 10కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని తమకు ఎంఐఎం మద్దతు తెలపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే ఎక్కువన్నారు. బీఆర్ఎస్ నేతలపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నామంటున్నారనే దానిపై వివరణ ఇస్తూ,. అవన్ని గత ప్రభుత్వంలో వాళ్లు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులన్నారు.

జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫోటోలు.. వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో.. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉందని,..కానీ వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా భాద్యత విస్మరించారని తెలిపారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందేన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement