Sunday, May 5, 2024

తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : ఆగష్టు 27(వాయిస్ టుడే) తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ సెప్టెంబర్ 6న సికింద్రాబాద్ క్లాక్ టవర్ మహబూబ్ కాలేజ్ వద్దగల ఎస్ వీ ఐటీ కన్వెన్షన్ లో ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ద్వితీయ ప్లీనరీకి సంబంధించిన బ్రోచర్లను టీఎంకేజేఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, దిలీప్,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దాదె వెంకట్, సూర్యాపేట జిల్లా సీనియర్ జర్నలిస్ట్ కోలా నాగేశ్వర్ రావు, వరంగల్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ లు వలిశెట్టి సుధాకర్, గజ్జెల శ్రీనివాస్,ములుగు జిల్లా అధ్యక్షులు పిట్టెల మధుసూదన్,సీనియర్ జర్నలిస్ట్ లు జక్కుల శ్యామ్, సుంకరి రవికిరణ్,బద్రాద్రి కొత్తగూడెం జర్నలిస్ట్ లు జోగం తారక్, బాపట్ల మురళి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, వెంకటేష్, టిఎంకేజేఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ , జగిత్యాల జిల్లా అధ్యక్షులు వంగల రమేష్ పటేల్,ప్రధాన కార్యదర్శి సూదుల వెంకటరమన్ పటేల్, ఉపాధ్యక్షులు దులూరి జగన్ మోహన్ పటేల్, కొత్త సత్యనారాయణ పటేల్, సుమ పటేల్, బండి రఘు పటేల్, కోశాధికారి తోటరమణ పటేల్, కార్యవర్గ సభ్యులు సుగుణాకర్ పటేల్ తో కలిసి ఆవిష్కరించారు.

.ఈ సందర్భంగా కొత్త లక్ష్మణ్ మాట్లాడుతూ గతేడాది కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొదటి ప్లీనరీ సమావేశాన్ని సుమారు 12 వందల మంది మున్నూరుకాపు జర్నలిస్టులతో కలిసి కరీంనగర్ లో నిర్వహించామన్నారు. ద్వితీయ ప్లీనరీలో జర్నలిస్టుల ఆకాంక్షలు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించి వాటి సాదన దిశగా అడుగులు వేస్తామన్నారు. 33 జిల్లాలకు చెందిన మున్నూరుకాపు జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement