Sunday, April 28, 2024

మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరు.. రంజాన్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుతాం: మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరని సాంఘిక సంక్షేమ, మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కులమతాలు, ప్రాంతాలు, భాషలు, జాతులకు అతీతంగా ప్రజలందరి సంక్షేమం కోసం సిఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. అన్ని మత ధర్మాలను కేసీఆర్‌ సమానంగా చూస్తున్నారని అన్నారు. రంజాన్‌ సందర్భంగా ముస్లిమ్‌ సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రంజాన్‌ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుతామన్నారు. ఇప్పటికే మైనారిటీల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి మరమ్మత్తులకు నిధులిస్తున్నామని తెలిపారు.

పేదలకు దుస్తుల పంపిణీతో పాటు విందులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 204 గురుకులాలు ఏర్పాటు చేసి మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని, విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రూ.20 లక్షలు ఉచితంగా అందజేస్తున్నామని ఆయన తెలిపారు. పది మంది ఇమామ్‌, మౌజంలకు రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని వెల్లడించారు. పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు షాదీ ముభారక్‌ ద్వారా రూ.1,00,116 లు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. ఉర్దూ భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు రెండవ అధికారిక భాషగా గుర్తించి గౌరవిస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement