Friday, May 3, 2024

Minister KTR : మ‌హిళా సంక్షేమంలో దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌

మ‌హిళా సంక్షేమంలో దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ నిలుస్తుంద‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా కేసీఆర్‌ సర్కార్‌ అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుందని తెలిపారు. ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం అని.. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం అని వ్యాఖ్యానించారు. అమ్మఒడి వాహనమైనా.. ఆరోగ్యలక్ష్మి పథకమైనా.. నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హర్షం దక్కిందని అన్నారు.

ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం…
సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగం…

మహిళా సంక్షేమంలో..
మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..

అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి…
ఆరు పదులు దాటిన అవ్వల వరకు…
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది…
మనసున్న కేసీఅర్ సర్కార్…

- Advertisement -

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా.. కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదు… ఒక విప్లవం అని తెలిపారు. ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్ వేసిందని.. మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్ స్టాప్ పెట్టిందని.. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అని పేర్కొన్నారు. పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ అని అన్నారు. మన అంగన్వాడీలను, ఆశా కార్యకర్తలను వెవట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి.. దేశంలోనే అత్యధిక పారితోషికాలు ఇచ్చి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదని.. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement