Saturday, October 12, 2024

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి : స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి

నిజామాబాద్ : మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవం కార్యక్రమంలో స్పీక‌ర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హిళ‌ల అభ్యున్న‌తికి ప్ర‌భ‌త్వం పెద్ద‌పీట వేస్తుంద‌న్నారు. మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధితో ఆర్థికంగా ఎద‌గాల‌న్నారు. ఇప్ప‌టికే అన్నిరంగాల్లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ద‌క్కుతుంద‌న్నారు. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని సభాపతి అన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్దఎత్తున మహిళ ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘం నాయకులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement