Thursday, May 2, 2024

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ sప్రభుత్వం మరో లేఖ రాసింది. శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలి కోరింది. ఏపీలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎస్కేప్ చానల్ ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించకుండా నిలువరించాలని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా బోర్డు ఛైర్మన్​కు నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. సుంకేశుల ఆనకట్ట కేసీ కాల్వకు 39.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా ప్రతి ఏటా సగటున 54 టీఎంసీల తుంగభద్ర జలాలను తరలిస్తున్నారని తెలిపారు. దీంతో ఆర్డీఎస్​కు 15.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా… సగటున ఐదు టీఎంసీలకు మించి తరలించడం సాధ్యం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. తుంగభద్ర జలాలను కేటాయింపులకు మించి తీసుకోవడంతో పాటు కృష్ణా జలాలను ముచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎస్కేప్ చానల్ ద్వారా కేసీకాలువకు తరలిస్తున్నారని తెలిపారు.

తుంగభద్ర జలాలకు అదనంగా కేసీ కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమం అని పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 టీఎంసీలు మాత్రమే తరలించాలని అన్నారు. అయితే, అక్రమ లిఫ్ట్ ల ద్వారా పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నదని ఆరోపించారు. ట్రిబ్యున ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను కేఆర్ఎంబీ నిరోధించాలని బోర్డు చైర్మన్ కు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement