Wednesday, May 1, 2024

Breaking: కోకాపేట్ భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కోకాపేట్ నియోపోలీస్ లోని భూముల వేలానికి HMDAకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 239, 240 సర్వే నంబర్లలోని భూమిపై హక్కులు పూర్తిగా ప్రభుత్వానివేనని నిర్ధరణ అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెంట్​గా హెచ్ఎండీఏ భూముల ఈ-వేలం నిర్వహించిందన్న ప్రభుత్వం.. వేలంలో భూములు కొన్న బిడ్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్​కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ ఏడాది జులైలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో ప్లాట్లు హాట్‌ కేక్‌లుగా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలికింది. గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement