Wednesday, May 15, 2024

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్

తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు జరిగాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 14 నెలల క్రితం ఐజీ హోదాలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) విభాగాధిపతిగా నియమితులైన ప్రభాకర్‌ రావు పదవీ విరమణ పొందారు. అయితే, ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం మూడేళ్లు పొడిగించి ఓఎస్డీగా నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే నిఘా విభాగం చీఫ్ నవీన్‌ చంద్ పదవీ విరమణ చేయడంతో ప్రభాకర్‌ రావుకు ఇంటెలిజెన్స్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏడాదిపాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గాను, ఎస్ఐబీ చీఫ్‌గానూ కొనసాగారు. అయితే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్‌కుమార్‌ను నియమించడంతో ప్రభాకర్‌ రావు ఎస్ఐబీ ఓఎస్డీగా మాత్రమే కొనసాగుతారు.

ఇది కూడా చదవండిః లీడ్స్ వేదికగా మరో సమరం.. నేడు భారత్‌-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement