Sunday, June 13, 2021

ఈటలతో ముగిసిన బీజేపీ నేతల భేటీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్ తో పాటు ఇతర తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ లో ఆత్మగౌరవనికి అహంకారానికి
మధ్య యుద్ధం నడుస్తుందని అన్నారు తరుణ్ చుగ్. ఒక్క వ్యక్తి అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటెల గొంతు వినిపించారని అన్నారు ఈటల రాజేంధర్. ఇన్నాళ్లు ఈటల టీఆర్ఎస్ లో సంఘర్షణ చేశారని..తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కేసీఆర్కు తన కుటుంబం ఎక్కువ అయిందని తెలంగాణ గౌరవం చులకన అయ్యిందని తరుణ్ చుగ్ విమర్శించారు. ఈటెల పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందన్నారు..మా అందరి ఉదేశ్యం ఒక్కటేనని..కేసీఆర్ అహంకారం …రాజరికం తెలంగాణ నుంచి పోవాలన్నారు. తెలంగాణ వికాసం కోసం ఎవరి తో అయిన కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈటెల. బీజేపీ లోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడటం ఆయన అహంకార ఓడటమని పిలుపునిచ్చారు తరుణ్ చుగ్.

Advertisement

తాజా వార్తలు

Prabha News