Wednesday, May 1, 2024

Meet The Press : ఏ రాష్ట్రంలో లేని ప‌థ‌కాలు తెలంగాణ‌లోనే… మంత్రి హ‌రీష్‌రావు

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్​లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కేంద్ర ఇచ్చే అవార్డుల్లో రాష్ట్రం అవార్డుల పంట పండిస్తోందని చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ రాజీలేని పాలన సాగిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హమీలు అమలు చేశామని.. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతు బంధు, రైతు బీమా వంటి కర్షక సంక్షేమ పథకాలు అమలు చేశామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement